Sai Pallavi: ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి పేరును కొందరు పనికట్టుకుని వివాదాల్లోకి లాగడం మామూలైపోయింది. మరీ ముఖ్యంగా ఆమె సినిమాలు విడుదల సమయంలో ఏదో రకంగా పాత సంఘటనలకు వెలికి తెచ్చి ఆమెను కాంట్రావర్శీలకు కేంద్ర బిందువును చేస్తున్నారు. గతంలో సైనికుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆమె చిత్రం ‘అమరన్’ విడుదల సమయంలో తెరమీదకు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Gold rate: బంగారం భగ్గుమన్నది..80వేలను తాకింది..
Sai Pallavi: ఆ సినిమాను బహిష్కరించమని కూడా కొందరు సోషల్ మీడియాలో పిలుపు నిచ్చారు. అయితే ఆ బాయ్ కాట్ మిస్ ఫైర్ అయ్యింది. ‘అమరన్’ అఖండ విజయాన్ని అందుకుంది. తాజాగా ఆమె రామాయణం సినిమాలో సీత పాత్ర చేస్తోంది. ఈ సినిమా కోసం సాయిపల్లవి తన పాత అలవాట్లను మార్చుకుందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమె శాకాహారిగా మారిపోయిందని పేర్కొన్నారు.
Sai Pallavi: అయితే ఆమె మొదటి నుండి శాకాహారేనని కొందరు బదులిచ్చారు. ఇలా తన మీద ఇష్టానుసారంగా, తోచినవార్తలను ప్రచారంచేస్తే ఇక సహించలేది లేదని వారిని లీగల్ గా ఎదుర్కొంటానంటూ సాయిపల్లవి ఫైర్ అయ్యింది. ఆమె నిర్ణయాన్ని బలపరుస్తూ ప్రకాశ్ రాజ్ సైతం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మరి ఇప్పటికైనా సాయిపల్లవిపై నెటిజన్స్ ట్రోలింగ్ ఆపుతారో లేదో చూడాలి.