Road Accident: హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఇంటిలో తీవ్ర విషాదం అలుముకున్నది. ఆయన మనమడు, మాజీ కార్పొరేటర్ కుమారుడు కనిష్క్ రెడ్డి (19) ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చిన్నవయసులో చనిపోవడంతో ఆ కుటంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Road Accident: హైదరాబాద్ నగర శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద అవుటర్ రింగ్‌రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెనుక వైపు నుంచి వెళ్లి ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కనిష్క్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు.
Road Accident: మృతుడు కనిష్క్‌రెడ్డి మాజీ కార్పొరేటర్ సుచరితారెడ్డి కుమారుడు. ఎంతో భవిష్యత్తు ఉన్న కనిష్క్‌రెడ్డి యుక్తవయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో పలువురు కంటతడి పెట్టుకుంటున్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం కావడంతో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి మృతుడికి సంతాపం తెలుపుతూ, కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.