RGV

RGV: రామ్ గోపాల్ వర్మ శారీ మూవీ.. మరో సాంగ్ వదిలాడండోయ్..!

RGV: విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘శారీ’ జనవరి 30న విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత రవిశంకర్ వర్మ తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్రాలలో విడుదల చేయబోతున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిదుకున్న ‘శారీ’ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్యదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలోని సెకండ్ సింగిల్ ‘ఎగిరే గువ్వలాగా…’ను ఆర్జీవీ డెన్ లో శుక్రవారం విడుదల చేశారు. రాకేశ్‌ పనికెళ్ళ ట్యూన్ చేసి, ఈ పాటను రాశారు. దీనిని సాయి చరణ్‌ పాడారు. ఇటీవల విడుదలైన తొలి గీతం ‘ఐ వాంట్ లవ్’ కు మంచి స్పందన లభించిందని, ఈ పాట కూడా తప్పకుండా శ్రోతల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత రవి శంకర్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  HIT 3: 'హిట్‌ 3' టికెట్‌ ధరల పెంపు.. ఏపీ ప్రభుత్వం అనుమతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *