revanth reddy

Revanth Reddy: రైతుకు బేడీలు..సీఎం సీరియస్..

Revanth Reddy: తెలంగాణలో లగచర్ల రైతుల పోరాటం తీవ్ర రాజకీయ పరిణామాలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే అధికారులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆ గ్రామ రైతులను అరెస్ట్‌ చేసి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. వారికి సంబంధించి కేసు విచారణలో ఉంది. అయితే దాడి నెపంతో అమాయక రైతులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే లగచర్లలో బీభత్సం సృష్టించిన పోలీసులు తాజాగా మరో దారుణానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురయిన లగచర్ల రైతును బేడీలతోనే ఆస్పత్రికి తరలించడం సంచలనంగా మారింది. పోలీసుల చర్య రాజకీయ దుమారం రేపింది. ఆ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రతిపక్షాలు మండిపడుతుండడంతో ముఖ్యమంత్రి స్పందించి సంబంధిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Mangampet Incident: పోలీసులు పట్టించుకోలేదు అని.. కువైట్ నుంచి వచ్చి చంపేశాడు

వికారాబాద్‌ జిల్లాలోని రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఫార్మా విలేజ్‌ ఏర్పాటుపై తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో అధికారులను ఘెరావ్‌ చేశారు. అధికారులపై దాడికి పాల్పడ్డారనే కారణంతో అమాయక రైతులను అరెస్ట్‌ చేశారు. కొందరు సంగారెడ్డి రెడ్డి జైలులో ఉండగా.. మరికొందరు ఇతర జైళ్లల్లో ఉన్నారు. తాజాగా అరెస్టయిన రైతుల్లో ఇద్దరు అనారోగ్యానికి గురయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు గుండె నొప్పి వస్తే ఆ సమాచారం బయటకు రాకుండానివ్వకుండా ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Harish Rao: రేవంత్ రెడ్డి సర్కార్‌పై మండిపడ్డ హరీష్‌రావు

Revanth Reddy: లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను సీఎం ఆరా తీశారని సమాచారం. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. ఘటనపై  విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు ఈ సంఘటనను ఖండించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kadapa Chetha Scam: వసూళ్లు కొండంత.. ఖజానాకు చేరేది గోరంత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *