Renu Desai: నటి రేణూ దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మిగతా జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తానని సంచలన ప్రకటన చేశారు. తనకు ఆ మార్గమంటేనే ఇష్టమని ప్రకటించుకున్నారు. అకీరా, ఆద్య చిన్నవాళ్లేనని, వారి కోసం తాను ఇక్కడే ఉంటానని, వారు కొంత పెద్దయ్యాక తాను సన్యాసినిగా జీవిస్తానని రేణూ దేశాయ్ వెల్లడించారు.
Renu Desai: ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలను వెల్లడించారు. బద్రి సినిమాతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చిన రేణూదేశాయ్.. ఆ తర్వాత జానీ సినిమాలో నటన అనంతరం నటనకు దూరమయ్యారు. ఆమె పవన్‌కల్యాణ్‌ను వివాహమాడిన అనంతరం.. ఆయనకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. వారిద్దరి విడాకుల అనంతరం రైటర్‌గా, డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
Renu Desai: ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో నటించారు. ఆ తర్వాత మహిళా ప్రాధాన్యమున్న సినిమా చాన్సులు వస్తున్నాయని రేణూ దేశాయ్ తెలిపారు. ఇటీవలే అత్తగారి పాత్రకు ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టు ఆమె చెప్పారు. త్వరలో ఆ సినిమా ప్రారంభం అవుతుందని వెల్లడించారు.
Renu Desai: ఇదే సమయంలో రేణూ దేశాయ్ మరో ఆసక్తికర విషయమూ చెప్పారు. మనం రూ.100 సంపాదిస్తే, దానిలో రూ.60 ఖర్చు చేసి, రూ.40 దాచుకోవాలని, మన ఆదాయం 60 రూపాయలే అని నిర్ణయించుకోవాలని, అప్పుడే ఆ మిగతా సొమ్మును దాచుకోవచ్చు.. అని చెప్పుకొచ్చారు. కానీ, ఈ రోజుల్లో యువత రూ.100 సంపాదిస్తే, ఆ రూ.100ని ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇంకా అదే రూ.100 సంపాదించి, క్రెడిట్ కార్డులు వాడి రూ.150 ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల అనవసరమైన ఆందోళనను తెచ్చుకున్నట్టేనని హితవు పలికారు.