Red Sandalwood

Red Sandalwood: అంత సీన్ లేదు ‘పుష్పా’! ఎర్రచందనం కోట్లు తీసుకురాదు.. ఇదే రుజువు

Red Sandalwood: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చి రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప-2 సినిమా కథ మొత్తం ఎర్రచందనం చుట్టూనే తిరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి కోట్లకు కోట్లు రేటు పలుకుతున్నట్టు చూపిస్తారు. అయితే, నిజానికి దానికి అంత సీన్ లేదని తేలిపోయింది.  గత పదేళ్లలో పోలీసులు, ఏపీ యాంటీ టాస్క్‌ఫోర్స్  5,376 టన్నుల ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు .  దీనిని అమ్మకానికి పెట్టగా అనుకున్నంత స్థాయిలో డిమాండ్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది .  

 గ్లోబల్ టెండర్ల ద్వారా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయించాలని గతేడాది రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నించింది. అయితే, టెండర్ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిరాశే ఎదురైంది. తాజాగా 905 టన్నులు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించినా అంతగా స్పందన రాలేదు. వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడానికి ముందుకు రాలేదు .  ఎర్ర చందనం టన్ను ధరను అటవీశాఖ రూ. 70 లక్షలుగా నిర్ణయించగా, ఎక్కువమంది వ్యాపారులు రూ . 50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. ఒకరిద్దరు వ్యాపారాలు టెండర్ రేటుకు బిడ్స్ వేశారు. కానీ, వారు కేవలం 30% దుంగలను మాత్రమే కొనుగోలు చేశారు .  

ఇది కూడా చదవండి: Ram Charan: రామ్‌చ‌ర‌ణ్ అభిమాని సూసైడ్ లేఖ క‌ల‌క‌లం!

Red Sandalwood: 2016-19 మధ్య టన్ను ఎర్రచందనం ధర రూ. 70 నుంచి రూ. 75 లక్షలు పలికింది. కానీ, ఇప్పుడు అమాంతం రూ. 20 లక్షలు తగ్గిపోయింది. అయితే, ఇందుకు చైనా, జపాన్, మలేసియా, సింగపూర్, అరబ్ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు.

మొత్తంగా చూసుకుంటే, ఎర్రచందనంతో కోట్లాది రూపాయలు అనే భావనే తప్పు అనేవిధంగా పరిస్థితి ఉంది. సినిమా అంటే అంతేకదా.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *