Ram Charan: ఇప్పటి వరకు పుష్ప 2 మ్యానియాతో తెలుగు సినీ ప్రేక్షకలోకం మునిగిపోగా, ఈసారి గేమ్‌చేంజర్ రూపంలో
ఆవరించబోతుంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మెగా అభిమానుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు వీరాభిమానులు ఎప్పుడెప్పుడు పండుగ చేసుకోవాలా? అనుకుంటూ ఊగిపోతున్నారు. ఇదే తరహాలో ఓ అభిమాని ఏకంగా తాను చావడానికి సిద్ధమైనట్టు రాసిన ఓ లేఖ కలకలం రేపుతున్నది. గేమ్‌చేంజర్ సినిమాపై ఆ అభిమాని రాసిన లేఖ సంచలనంగా మారింది.
Ram Charan: గేమ్‌చేంజర్ సినిమా ప్రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయాలని, లేకుంటే తన చావు కళ్ల చూస్తారు అంటూ ఏకంగా సినిమా పేరిటా ఆ అభిమాని తనకున్న వీరాభిమానం చాటుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారధ్యంలో వస్తున్న ఈ గేమ్‌చేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా వస్తుందని ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగి, అసహనానికి దారితీసేలా ఉన్నది.
Ram Charan: ఆ వీరాభిమాని రాసిన గేమ్‌చేంజర్ టీమ్ పేరిట రాసిన లేఖలో ఏమున్నదో తెలుసా? సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి ట్రైలర్ అప్‌డేట్స్ ఇవ్వట్లేదని ఆ అభిమాని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ నెలాఖరు కల్లా అంటే న్యూఇయర్ రాకముందే ట్రైలర్ రిలీజ్ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్నా అంటూ పేరుతో సహా పేర్కొన్నాడు.
Ram Charan: అభిమాని లేఖపై పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ, ఇంతలా సచ్చే అభిమానం వద్దని హెచ్చరిస్తున్నారు. సినిమా పిచ్చోళ్లు అంటే విన్నాం కానీ, ఇప్పుడే చూస్తున్నాం.. అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇంతలా అభిమానం ఏందిరా బాబూ.. అంటూ ఇంకొందరు విస్మయం వ్యక్తం చేశారు. ఏదేమైనా అభిమానం హద్దులు దాటొద్దన్నది అందరి అభిప్రాయం.