Red Fort: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ చోరీ చోటుచేసుకున్నది. అత్యంత పటిష్ఠమైన భత్రత ఉండే ఎర్రకోట ప్రాంగణంలో ఈ చోరీ జరిగడం గమనార్హం. జైనుల మతాచారంలో భాగమైన కోటి విలువైన వజ్రాలతో పొదిగిన కలశాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనతో కలకలం చెలరేగింది. చారిత్రక వస్తువును చోరీ చేయడంతో భద్రతా చర్యలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Red Fort: జైనుల దశలక్షణ మహాపర్వం పేరిట ఎర్రకోట ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 760 గ్రాముల బంగారం, వజ్రాలు, పచ్చల ఆభరణాలతో పొదిగిన కలశాన్ని ఉపయోగించారు. ఇదే కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరయ్యారు. ఈ సమయంలో అంతా ఓంబిర్లాకు స్వాగతం పలుకుతూ బిజీగా ఉన్న సమయంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించి ఆ కలశాన్ని అపహరించారు.
Red Fort: అనంతరం కార్యక్రమం ప్రారంభంకాగానే వేదికపై ఉంచిన కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీల ఫుటేజీలో ఒక అనుమానిత వ్యక్తి కదలికలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎర్రకోట ఆవరణలోనే ఈ భారీ చోరీ చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది.