ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా. రాజ్యమేలుతుంది. జిల్లా పరిధిలోని 17 నియోజకవర్గాల్లో సిండికేట్లుగా మారి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. అయ్యో ఇదేంటని అధికారులని అడగగా రేషన్ మాఫియాకి ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయంటూ సమాదానమిస్తున్నాలోస్తున్నాయి. ఎమ్మెల్యేను ఇదేంటని అడగగా మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్న వైనం కనపడుతుంది.
లబ్ధిదారుల వద్ధ నుంచి రేషన్ బళ్లు నిర్వాహకులు కిలో రేషన్ 10రూపాయలకి కోనుగోలు చేస్తూ… రేషన్ బళ్ల వద్ధ నుంచి కిలో 14రూపాయకి కోనుగోలు చేస్తూ భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.
తర్వాత ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో 27 నుండి 30 రూపాయలకి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. పల్నాడు జిల్లాలోని గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలను రేషన్ మాఫియాని శాషిస్తుంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే అండదండలతో రేషన్ మాఫియా చక్రం తిప్పుతుంది.
మరోవైపు, రేషన్ మాఫియాపై తెనాలి, పోన్నూరు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యే ఉక్కుపాదం మోపుతున్నారు.

