ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తన కెరీర్ లో రతన్ టాటా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
రతన్ టాటా అందుకున్న అవార్డులు..
దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను 2000లో అందుకున్నారు.
2004లో మెడల్ ఆఫ్ ద ఒరియెంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పురస్కారం
2007లో కార్నేజ్ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రపీ అవార్డు
భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో అందుకున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం 2006లో మహారాష్ట్ర భూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది.
2008లో సింగపూర్ ప్రభుత్వం నుంచి హానరరీ సిటిజన్ అవార్డ్
2009లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ అవార్డ్
2009లో ఇటలీ నుంచి గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అని ఆ దేశ అత్యున్నత పురస్కారం
2010లో యేల్ యూనివర్సిటీ నుంచి లెజెండ్ ఇన్ లీడర్ షిప్ అవార్డ్
2012లో జపాన్ ప్రభుత్వం నుంచి గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ పురస్కారం
2014లో హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ పురస్కారం క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు.
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కమాండర్ ఆఫ్ లిజియన్ ఆఫ్ ద హానర్
2021లో అస్సాం వైభవ్‌తో రతన్ టాటాను సన్మానించారు
2023లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అందుకున్నారు
2023 మహారాష్ట్ర ఉద్యోగరత్న
వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను రతన్ టాటా అందుకున్నారు.