Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు నిన్న అర్ధరాత్రి నుంచే తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ కి పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా జపాన్‌లో కూడా గణనీయమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లోని అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా, రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ని జపాన్‌లో కూడా విడుదల చేయాలని అక్కడి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తమ హీరో పట్ల గర్వంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి జపాన్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఎంతటిదో స్పష్టమవుతోంది. అయితే, ‘గేమ్ ఛేంజర్’ జపాన్ అభిమానుల కోరిక మేరకు అక్కడ విడుదల అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
