KCR: కేసీఆర్ (కేశవచంద్ర రమావత్) సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత రాకింగ్ రాకేశ్ ప్రకటించారు. ఇన్ని రోజుల తమ శ్రమ ఫలించబోతుందని తన భార్య సుజాతతో కలిసి ప్రకటించారు. బలగం డైరెక్టర్ వేణు కేసీఆర్ సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ, ఏపీతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అందరూ ఆదరించి తమకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా రాకేశ్, సుజాత కోరారు. ఈ నెల 22న కేసీఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని వెల్లడించారు.

