The Raja Saab: ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి.’ జనవరి 3న జపాన్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడికి వెళ్ళాల్సి ఉన్నా… కాలికి అయిన గాయంతో అతను ఈ ప్రయాణాన్ని విరమించుకున్నారు. అయితే ప్రభాస్ గాయం వార్త బయటకు రావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభాస్ వివరణ ఇస్తూ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపాడు. అలానే జపాన్ రాలేకపోతున్నందుకు బాధగా ఉందంటూ అక్కడి అభిమానులకు వీడియో సందేశాన్ని పంపాడు. అందులో చివరిలో జపనీస్ భాషలో మాట్లాడి వారిలో సరికొత్త జోష్ ను ప్రభాస్ నింపాడు.
ఇది కూడా చదవండి: Game Changer: డల్లాస్ లో ‘గేమ్ ఛేంజర్’ డోప్ ఫుల్ సాంగ్!
The Raja Saab: ఇదిలా ఉంటే… తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీ నుండి క్రిస్మస్ లేదా జనవరి 1న టీజర్ వస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. అలానే ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే పుకార్లూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఓ వివరణ ఇచ్చింది. టీజర్ విడుదల విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. అలానే సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం శరవేగంగా సాగుతోందని చెప్పారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం శోచనీయం!