Rahul Sipligunj: తెలుగు సినిమా పాటలకు కొత్త ఊపు తెచ్చిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆస్కార్ విజేతగా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. కేవలం పాటలతోనే కాదు, ‘బిగ్ బాస్’ లాంటి రియాలిటీ షోలతో కూడా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ స్టార్ సింగర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు.
రాహుల్ సింగిల్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హారణ్య రెడ్డి. ఈమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తెనే ఈ హారణ్య.
గత కొంతకాలంగా రాహుల్, హారణ్య ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో, ఆగస్టు 17న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
నిశ్చితార్థం ఫొటోలను టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు రాహుల్, హారణ్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆస్కార్ అవార్డు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మా అన్న కూతురు హరణ్యా రెడ్డి నిశ్చితార్థం హైదరాబాదులోని ITC కోహినూర్ లో ఘనంగా జరిగింది. పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం సంతోషంగా ఉంది.#kotamreddysrinivasulureddy#iTDforTDP#tdp#tdpnellorecity… pic.twitter.com/vtLch6vTWA
— Kotamreddy Srinivasulu Reddy (@Kotamreddy_TDP) August 18, 2025