Rahul Gandhi: తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీసీ హక్కుల కోసం పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు..
“కుల గణన ఆధారంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం. రాష్ట్రపతి ఈ ధర్నాను గమనించి, బీసీ బిల్లుకు ఆమోదం ఇస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.ఇది కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా ఉన్న అణగారిన వర్గాల కోసం చేస్తున్న పోరాటమని స్పష్టంచేశారు.
ఈ బిల్లు భారత రాజ్యాంగంలో చెప్పిన సామాజిక న్యాయానికి పెద్ద అడుగు అని రాహుల్ పేర్కొన్నారు. కుల గణన (Caste Census) ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం, అన్ని వర్గాల వాస్తవ స్థితిగతులను గుర్తించి, వాటికి అనుగుణంగా హక్కులు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించబడింది.
అంతేకాదు, ఈ పోరాటానికి INDIA కూటమి (ఐఎన్డీఐఏ) నేతలు మద్దతు పలికినందుకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని అణగారిన వర్గాలకు తగిన హక్కులు, అధికారాల్లో వాటా కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
The Telangana Government and Congress sat on a dharna in Delhi today, demanding that the President assent to the law reserving 42% for backward classes in education, employment and local government.
This law is a major advance towards the Constitution’s vision of social…
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2025

