Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ– “బీజేపీ, RSS రాజ్యాంగాన్ని బొంద పెడుతున్నాయి. కులగణన చేయాలనే ఉద్దేశ్యం వారికేలేదు. అలాగే 50% రిజర్వేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి కూడా బీజేపీ ముందుకు రావడం లేదు” అని అన్నారు.
మహారాష్ట్రలో కొత్తగా ఒక కోటి ఓటర్లు జాబితాలో చేరారని, ఆ ఓట్లు అన్నీ బీజేపీకే పడినట్లుగా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
“వీడియో ఫుటేజ్ చూపించమని ఎన్నికల సంఘం అడిగితే, బీజేపీ చూపించదు. కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు చోరీ అయ్యాయి. బీహార్‌లో కూడా ఇదే తరహా ఓట్ల దోపిడీ జరిగింది” అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మళ్లీ ఎన్నికల పారదర్శకతపై చర్చ మొదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాలంటే ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలను ఆపాలని ఆయన స్పష్టం చేశారు.