Raghu Dixit: ప్రముఖ సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. వారిజా శ్రీ వేణుగోపాల్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమె వయసు 34. వీరిమధ్య దాదాపు 16 ఏళ్ల తేడా ఉంది. ఈనెలాఖరున వివాహం చేసుకుంటారట. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Nagarjuna 100 Film: నాగ్ 100వ సినిమాలో అనుష్క?
రఘు దీక్షిత్.. సింగర్, ఫ్లూటిస్ట్‌గా పేరు సొంతం చేసుకున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయాని వివాహం చేసుకున్నారు. అయితే విభేదాలతో 2019లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు.అయితే ఇటీవల వారిజా శ్రీతో ప్రేమలో పడ్డారు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని చివరకు పెళ్లికి సిద్ధమయ్యారు. ఈనెలాఖరున వీరి ప్రేమ వివాహం జరుగుతుందట. రఘు తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, కృష్ణార్జున యుద్ధం సినిమాలలో పలు హిట్ పాటలు పాడారు. అలాగే తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా సాంగ్స్ పాడారు. ఇక వారిజా శ్రీ విషయానికి వస్తే.. ఆమె గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన భారతీయ గాయని, ఫ్లూటిస్ట్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 2024లో “ఎ రాక్ సమ్ హెయిర్” రచనకు జాకబ్ కొలియర్, అనౌష్క శంకర్ లతో కలిసి తన మొదటి గ్రామీ నామినేషన్ ను ఈమె అందుకున్నారు. అంతేకాదు చార్కా ఫోనిక్స్, స్నార్కీ పప్పీ వంటి బ్యాండ్లతో కలిసి పనిచేసే స్వతంత్ర కళాకారిణిగా పేరు తెచ్చుకున్న ఈమె, “కర్ణాటిక్ స్కాట్ సింగింగ్” అనే కళారూపాన్ని కూడా సృష్టించింది.