Pushpa 2: అనుకున్నట్టు గానే ‘పుష్ప-2’తో మైత్రీ మూవీ మేకర్స్ సరికొత్త రికార్డ్ ను సృష్టించారు. ఐకాన్ స్టార్ కు ఉన్నక్రేజ్ కు తగ్గట్టు భారీగా ‘పుష్ప-2’ను తీసి, అంతే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ‘పుష్ప-2’ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సరికొత్త ల్యాండ్ మార్క్ ను సృష్టించింది. ఏకంగా రూ. 294 కోట్లను కలెక్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ స్థానంలో ఉన్న ‘ట్రిపుల్ ఆర్’ రికార్డ్ ను అది బద్దలు కొట్టింది. తొలి రోజున ‘ట్రిపుల్ ఆర్’ రూ. 223 కోట్లు కలెక్ట్ చేసింది. అలానే ‘బాహుబలి -2’ రూ. 210 కోట్లు వసూలు చేసింది. ‘కల్కి 2898 ఎ.డి’ రూ. 180 కోట్ల గ్రాస్ వసులూ చేసింది. వీటన్నింటినీ వెనక్కి నెట్టి ఇప్పుడు పుష్పరాజ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు.
View this post on Instagram

