Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న ‘పుష్ప2’ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని పాట నుంచి శ్రీలీల, బన్నీ పిక్ లీక్ అయింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ తో కలసి సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలని ఐటమ్ సాంగ్ కోసం పలువురు భామలను జల్లెడ పట్టి ఆఖరికి శ్రీలీలపై చిత్రీకరణ మొదలెట్టాశారు.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: బండ్ల గణేశ్ టార్గెట్ చేసిందెవరిని!?
Pushpa 2: గత ఐదు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు ఈ పాట నుంచి బన్నీ, శ్రీలీల పిక్ లీక్ కావటంతో నిర్మాణ సంస్థ అధికారికంగా సాంగ్ పేరును ప్రకటించారు. ఈ పాట ‘కిస్సిక్…’ అంటూ రానుందని చెబుతూ ‘కిస్పిక్… సాంగ్ ఆఫ్ ద ఇయర్’ అని ట్వీట్ చేసింది మైత్రీ సంస్థ. తొలి భాగంలో సమంతపై చిత్రీకరించిన ‘ఊ అంటావా మామ’ పాట ఏ స్థాయిలో హిట్ అయి సినిమాకు ప్లస్ గా నిలిచిందో తెలిసిన విషయమే. ఇప్పుడు ‘పుష్ప2’లో రాబోతున్న ‘కిస్సిక్’ పాట దానిని మైమరపిస్తుందేమో చూద్దాం..
Leakeddd 😲🔥🔥🔥🔥🔥
Debbalupadtai 🔥🔥🔥🔥🔥#Pushpa2TheRuleTrailer pic.twitter.com/zkaxzZAKpF— ALLU PAVAN (@PavanKu90551124) November 8, 2024

