Bandla Ganesh: బండ్ల గణేశ్ అనగానే నిర్మాతగా, నటుడుగా తను చేసిన సినిమాలే కాదు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, వాటి పర్యవసానాలు కూడా గుర్తుకు వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన బండ్ల గణేశ్ కాంగ్రేస్ పార్టీ వీరాభిమాని. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న గణేశ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో కామెంట్స్ తో సందడి చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా బండ్ల గణేశ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినమైన 8వ తేదీన కొందరు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇది కూడా చదవండి: Game Changer: రామ్ చరణ్ సంక్రాంతికి బాక్సాఫీస్ గేమ్ ఛేంజర్.. దుమ్ము లేపుతున్న టీజర్ !
Bandla Ganesh: అయితే శుభాకాంక్షలు తెలియచేయని వారి గురించి గణేశ్ తన ఎక్స్ లో స్పందిస్తూ ‘రేవంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు. తెలియచేయటానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సిఎం గారు కావలెను’ అంటూ పోస్ట్ చేశాడు. మరి టికెట్ రేట్స్ కోసం మాత్రమే సి.ఎం కావాలనుకునే ఆ కొందరు ఎవరు? అనే విషయంలో ఫిలిమ్ నగర్ లో జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. టైమ్ చూసి బండ్లన్న భలే పంచ్ వేశాడే అనే వారు కొందరైతే.. తను పెట్టింది కూడా నిజమే కదా! అనే వారు మరి కొందరు. ఏదేమైనా బండ్ల తన టార్గెట్ మాత్రం రీచ్ అయ్యాడు. మరి ఈ విషయంలో భుజాలు తడుముకునే వారెవరో!?
గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO
— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024