Weather: ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనించి తమిళనాడు, శ్రీలంక తీరంపైపు వెళ్తుందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నయి.
హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 23 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 27 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.