pushpa 2

Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో వస్తున్న ఈ మూవీ బిజినెస్ పరంగానే కాదు రిలీజ్ విషయంలోనూ రికార్డ్ సృష్టిస్తోంది.

Pushpa 2: ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 11,500 స్ర్కీన్స్ లో విడుదల చేస్తుండటం విశేషం. ఇండియాలో 6,500 థియేటర్లలో, ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్ లో విడుదల కాలేదని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తో పాటు పాటలు కూడా సెన్షేషన్ క్రియేట్ చేశాయి. ఇదే కాదు ఇంకా పలు రికార్డ్స్ పై కన్నేసింది ఈ మూవీ. తొలి రోజు వసూళ్ళ తో పాటు హైయెస్ట్ గ్రాసర్ తదితర అంశాలలో కూడా ‘పుష్ప2’ సృస్టించబోయే రికార్డులపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *