TGRTC Cargo

TGSRTC Cargo: ఇంటి వద్దకే కార్గో సేవలు..

TGSRTC Cargo: తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందులో భాగంగా కార్గోలో బుక్ చేసిన వస్తువులను హోం డెలివరీ చేసేవిధంగా సౌకర్యం కల్పిస్తున్నారు

ఆదివారం(ఈ నెల 27) నుంచి హైదరాబాద్ నుంచి హోండెలివరి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదారాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులోకి  రానున్నాయి.  టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదారాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేసుకోవొచ్చు. రాబోయో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హోం డెలివరి సేవలు అందించే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు హోండెలివరి సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

– పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలివే!

 👇

– 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50

– 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60

– 5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65

– 10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70

– 20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75

– 30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bomb Blast: మార్కెట్‌లో పేలుడు.. ఇద్దరు మృతి.. 11 మంది గాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *