pushpa 2

Pushpa 2 Collections: బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్న పుష్ప 2.. వైల్డ్ ఫైర్ లో కాలిపోతున్న రికార్డ్స్!!

Pushpa 2 Collections: ప్రస్తుతం అంతా పుష్ప మేనియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పుష్ప సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక గ్లోబల్ గా అయితే చెప్పనవసరం లేదు. కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులన్నీ బద్దలు అయిపోయాయి. ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించే పనిలో ఉంది పుష్ప 2 ది రూల్. సినిమాని శాసించడం అనే మాట చాలా సార్లు వినివుంటాం.. కానీ, ప్రత్యక్షంగా చూస్తున్నాం అని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇప్పట్లో ఈ రికార్డులకు దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి ఏ హీరోకూ లేదనిపిస్తోందని సినీ విశ్లేషకులూ అంటున్నారు.

కేవలం నాలుగు రోజుల్లో 750 కోట్ల రూపాయలు కొల్లగొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు పుష్ప రాజ్. తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి తరువాత చాలా సినిమాలు అదే రేంజ్ కి పరుగులు తీశాయి. ఒకదాని తరువాత ఒకటి బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలి అనే కసితో వచ్చాయి చాలా సినిమాలు. వాటిలో కొన్ని ఆ రికార్డులను బద్దలు కొట్టాయి కూడా. అందుకే బాక్సాఫీస్ రికార్డుల గురించి చెప్పేటప్పుడు నాన్ బాహుబలి రికార్డులు అంటూ కొత్త పదం పుట్టుకొచ్చింది. అంటే బాహుబలి రికార్డులను పక్కన పెట్టి ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులను చెప్పుకునేవారు. 

ఇప్పుడు అది పుష్ప 2 ది రూల్ గా మారిపోయింది. అంటే.. ఇకపై రికార్డులు చెప్పేటప్పుడు పుష్ప 2 రికార్డులు కాకుండా.. అని బాక్సాఫీస్ కలెక్షన్స్ మెన్షన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులే అయింది. నడవాల్సిన కథ చాలా ఉంది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఏదో మొదటి వారంతో ఆగిపోయే ఫైర్ లా పరిస్థితి కనిపించడం లేదు. పైగా ఈవారం నుంచి రేట్లు కూడా తగ్గిస్తున్నారు. దీంతో మొదటివారం థియేటర్ల వద్ద ఎలాంటి సందడి ఉందో అదే కంటిన్యూ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు ఈ నాలుగురోజుల్లో పుష్ప దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర చేసిన సందడి ఏమిటి అనేది ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకుందాం.

ఇది కూడా చదవండి:  Pushpa 2 Ticket Price: ఈరోజు నుంచి ‘పుష్ప-2’ టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు!

Pushpa 2 Collections: ప్రస్తుతం ఊహించని కలెక్షన్స్ తో భారతీయ సినిమా ని అల్లు అర్జున్ ఏలుతున్నారు. పుష్ప కలెక్షన్స్ చూసి దేశవ్యాప్తంగా ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా అందరి రికార్డ్స్ అల్లు అర్జున్ తిరగరాశాడు

ALSO READ  Namrata Shirodkar: 'ముఫాసా' అలరిస్తుందంటున్న నమ్రతా!

* మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే మూడు రోజుల్లో 640 కోట్ల వసూళ్లతో రికార్డు సాధించిన అల్లు అర్జున్ పుష్ప 2. 

* మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ 500 కోట్ల వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్.

* హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించిన అల్లు అర్జున్. 

* ఇప్పటివరకు జవాన్ సినిమా 65 కోట్లు రికార్డు ఉండగా ఇప్పుడు మొదటి రోజే 72 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును తిరగరాసింది. 

* రెండవ రోజు 59 కోట్లు వసూలు చేయగా మూడవరోజు 74 కోట్ల వసూళ్లతో మరోసారి తన మొదటిరోజు రికార్డు మించి వసూలు చేసింది. 

* ఒకటే సినిమా హిందీలో రెండు సార్లు హైయెస్ట్ వసూలు చేసిన సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. 

* భారతదేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్ లన్ని ఇప్పుడు అల్లు అర్జున్ కొల్లగొడుతుండగా, ఇది ఇలాగే జరిగితే మరో మూడు నాలుగు రోజుల్లో అల్లు అర్జున్ వెయ్యి కోట్లు వసూలు చేసే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. 

* ఇది ఇలాగే సాగితే ఎవరికి అందనంత ఉన్నత స్థాయికి అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

పుష్ప2 డే-3 శనివారం సాయంత్రం & రాత్రి షోలుఆక్యుపెన్సీ గురించి చెక్ చేస్తే.. 

👉#లక్నో : 100/100 (100%)

👉#పుణె : 119/121 (98%)

👉#అహ్మదాబాద్ : 218/226 (97%)

👉#ముంబయి : 469/496 (95%)

👉#చెన్నై : 212/234 (91%)

👉#కోల్‌కతా : 134/154 (87%)

👉#చండీగఢ్ : 65/76 (86%)

👉#న్యూఢిల్లీ : 523/628 (83%)

👉#బెంగళూరు : 245/334 (73%)

👉#కొచ్చి : 44/75 (59%)

పుష్ప2 డే-4 శనివారం సాయంత్రం & రాత్రి షోలు ఆక్యుపెన్సీ ఇలా ఉంది.. 

👉#లక్నో : 96/100 (100%)

👉#పుణె : 119/121 (98%)

👉#అహ్మదాబాద్ : 218/226 (97%)

👉#ముంబయి : 420/496 (95%)

👉#చెన్నై : 212/234 (91%)

👉#కోల్‌కతా : 134/154 (87%)

👉#చండీగఢ్ : 62/76 (86%)

👉#న్యూఢిల్లీ : 501/628 (83%)

👉#బెంగళూరు : 245/334 (73%)

👉#కొచ్చి : 44/75 (59%)

2024లో టాప్ 10 భారత్ సినిమాలు.. బుక్ మై షో టికెట్ల సేల్స్ ఇలా.. 

బుక్ మై షో లో టికెట్ల సేల్స్ పరిశీలిస్తే పుష్ప 2 రికార్డ్ ఎలా ఉందొ అర్ధం అవుతుంది. ఈ ఏడాది రిలీజ్ అయిన మన దేశ సినిమాల్లో కల్కి ఓవరాల్ రన్ లో 13.14 మిలియన్ల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇక రెండో ప్లేస్ లో స్త్రీ2 11.40 మిలియన్ల టికెట్ల సేల్ తో ఉంది. ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డులను తుడిచిపెట్టే దిశగా వేగంగా వెళుతోంది. కేవలం నాలుగు రోజుల్లో ఒక్క బుక్ మై షో నుంచే 9.3 మిలియన్ల టికెట్స్ కట్ అయ్యాయి. ఈ వీక్ లో కల్కిని బీటౌట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో ఆల్ టైం రికార్డ్స్ సృష్టించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బుక్ మై షో టికెట్ల సేల్స్ కింద తెలుసుకోవచ్చు. 

ALSO READ  Ayyannapatrudu: 14 వందల కోట్లదొంగ పెన్షన్లు.. ప్రభుత్వం సీరియస్..

1.#Kalki2898AD : 13.14M

2.#స్త్రీ2 : 11.40M

3.#పుష్ప2 : 9.3మి (4 రోజులు)

4.#అమరన్ : 4.89M

5.#దేవర : 4.80M

6.#హనుమాన్ : 4.72M

7.#భూల్భూలయ్యా3 : 4.67మి

8.#TheGOAT : 4.51M

9.#మంజుమ్మెల్ బాయ్స్ : 4.30M

10.#Singham ఎగైన్ : 3.77M

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *