Nandyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ దుండగుడి ఉన్మాదానికి ఓ యువతి బలైంది. ఇలాంటి ప్రేమోన్మాద చర్యలతో ఎందరో యువతులు జీవితాలు కోల్పోతున్నారు. చట్టాలను కాలదన్ని, ఎందరో దుర్మార్గులు రాక్షస ప్ర వృత్తితో దానవులుగా మారుతున్నారు. విచక్షణారహిత చర్యలకు దిగుతున్నారు. ఇక్కడా అలాంటి దుశ్చర్యకే పాల్పడ్డాడు. ఆమెను చంపడమే కాదు.. తను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వికృత చర్యకు దిగాడు.
Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బైరెడ్డినగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని లహరి (17)ని ప్రేమ పేరుతో అదే జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర అనే ప్రేమోన్మాది గత కొన్నాళ్లుగా వేధించసాగాడు. ఎన్నిసార్లు వెంటపడినా ఆ యువతి అతని ప్రేమను నిరాకరించింది. కాదు పొమ్మని దూరం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతూనే వెంటపడసాగాడు. అయినా అతనికి దూరమే జరిగింది.
Nandyal: ఆ యువతి వైఖరితో అతనిలో రాక్షసత్వం జడలు విప్పుకున్నది. దానవుడిగా మారాడు. తన ప్రేమను నిరాకరిస్తుందా? అన్న కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఈ భూమి మీదే బతక్కొద్దనుకున్నాడు. నిన రాత్రి ఆ యువతి ఇంటిలోకి దూరి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆ దుండగుడి పరిస్థితి విషమంగా ఉన్నది.