India: ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య అవినీతి. ఇది దేశం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. శాంతిభద్రతలు ఉన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా అవినీతికి అడ్డుకట్ట పడలేదు. ప్రస్తుత రోజుల్లో అవినీతి పెరిగిపోతుంది. దీని వల్ల పేదలు పేదలుగా మిగిలిపోతుంటే ఒక వర్గం మాత్రమే ధనవంతులు అవుతున్నారు. అందుకే అవినీతికి పాల్పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినీతి దేశాల లిస్ట్ లో మన దేశం ఎక్కడ ఉందో ఒకసారి తెలుసుకుందాం.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ ఏడాది జనవరిలో ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను విడుదల చేసింది. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 180 దేశాలు , భూభాగాలపై ఆధారపడి ఈ రిపోర్ట్ ఇచ్చింది. 2023 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్‌లో భారతదేశం 39 స్కోర్‌తో 93వ స్థానంలో ఉంది. 2022లో 85వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 93వ స్థానానికి చేరుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. పొరుగు దేశాలైన పాకిస్థాన్ 133, శ్రీలంక 115, బంగ్లాదేశ్ 149, ఆఫ్ఘనిస్తాన్ 162, చైనా 76, జపాన్ 16 స్థానాలను పొందాయి. ప్రభుత్వ రంగ అవినీతిని నియంత్రించడంలో చాలా దేశాలు ఎలాంటి పురోగతి సాధించలేదని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indian Railways: ఏ రైలు కైనా ఇంతకంటే లేటుగా వెళ్లడం సాధ్యం కాదు! స్టోరీ చూస్తే మీరూ ఇదే అంటారు