Pushpa 2 Ticket Price: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’ డిసెంబర్ 5న రిలీజ్ అయి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడురోజుల్లో రూ.621 కోట్లు వసూలు చేసినట్టు మూవీ టీం పోస్టర్ ని షేర్ చేసింది. ఈ క్రమంలో సోమవారం నుంచి టికెట్ ధరలు తగ్గనున్నాయి. దీంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పుష్ప -2 రిలీజ్ కి ముందు డిసెంబరు 4న స్పెషల్ ప్రీమియర్‌కు అదనంగా రూ.800 ధర నిర్ణయించడంతో టికెట్ ధర ఒక్కసారిగా వెయ్యి రూపాయలు దాటేసింది. ఇక తెలంగాణ ప్రభుతవం శ్లాబ్ సిస్టమ్ తరహాలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రిలీజ్ ఐన నాలుగు రోజులు అంటే ఆదివారం వరకూ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150 ఇంకా మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంచారు. దీంతో పుష్ప-2ని మల్టీప్లెక్స్‌లో చూడాలని అనుకునే వారు రూ.500పైనే చెల్లించాల్సి వచ్చేది. ఇక సింగిల్ స్క్రీన్‌లో రూ.300పైనే ఉంది.
ఇది కూడా చదవండి: Gold rate: నేటి బంగారం ధర..
Pushpa 2 Ticket Price: కొంత మంది ప్రేక్షకులు టికెట్ ధరలు తాగితే చూడం అని ఎదురుచూస్తున్నారు. ఇపుడు టికెట్ ధరలు తగ్గాయి. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా నైజాంలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్లు బుక్‌మై షోలో చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.200 (జీఎస్టీ అదనం) ఉండబోతుంది. మల్టీప్లెక్స్‌లో రూ.395గా ఉంది.(జీఎస్టీ అదనం) అంటే సింగిల్ స్క్రీన్‌లో అనుమతి తీసుకున్న మేరకు టికెట్ ధరను పెంచలేదు.
ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. వైజాగ్‌లో సింగిల్ స్క్రీన్‌లో రూ.295 ఉండగా మల్టీప్లెక్స్‌లో రూ.300-377 వరకూ ఉన్నట్లు బుక్‌మై షోలో చూపిస్తోంది. (గమనిక: ఈ ధరలు థియేటర్‌ను ఏరియా ను బట్టి మారుతూవుంటాయి.) ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్స్ షోకి మాత్రమే రూ.800 పెంచింది అక్కడి ప్రభుత్వం.