Puri Jagannadh

Puri Jagannadh: గోపీచంద్ తో మరో సినిమా చేయనున్న పూరీ జగన్నాథ్?

Puri Jagannadh: సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. హిట్టు కోసం ప్రస్తుతం కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. తాజాగా తనకు ‘గోలిమార్’ లాంటి హిట్ ఇచ్చిన హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన గోలీమార్ మంచి హిట్ అయింది. గంగారామ్ గా గోపి చంద్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. ఇన్నేళ్లకు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Keerthy Suresh: ‘ఎల్లమ్మ’ నుంచి కీర్తి సురేష్ ఔట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *