Naga Vamsi: టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ ఉన్న కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన కారులో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆ కారు నంబర్ ప్లేట్ “TG09F 1111” గా ఉంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన ఘటన మరవకముందే, ఈ వీడియో బయటకు రావడంతో వైసీపీ అభిమానులు, నేతలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచారం ప్రకారం, నాగవంశీ ప్రయాణించిన ఈ వాహనం ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి చెందినదని చెబుతున్నారు.
ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనంలో టాలీవుడ్ నిర్మాత
హరిహర వీరమల్లు హీరోయిన్ ఘటన మరవకముందే వైరల్ అవుతున్న నిర్మాత నాగవంశీ వీడియో
కారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి చెందినదిగా సమాచారం.#NagaVamsi #mla #AnaganiSatyaPrasad pic.twitter.com/3qloNnOOkt
— s5news (@s5newsoffical) August 12, 2025