Mithra Mandali: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కామెడీ ఎంటర్‌టైనర్ గురించే చర్చ నడుస్తోంది. ఆ సినిమా పేరే ‘మిత్ర మండలి’. దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ట్రోలింగ్‌పై బన్నీ వాస్ సంచలన వ్యాఖ్యలు
‘మిత్ర మండలి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని, ట్రోలింగ్ చేయిస్తున్నారని నిర్మాత బన్నీ వాస్ (Bunny Vasu) ఆరోపించారు. పెయిడ్ (డబ్బు చెల్లించిన) ట్రోలర్స్‌ను ఉపయోగించి తమ చిత్రాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Mouli Tanuj: ఒక్క హిట్‌తో జాక్‌పాట్ కొట్టిన యూట్యూబ్ స్టార్!
ఈ సందర్భంగా ఆయన ఘాటుగా స్పందించారు. మా సినిమానే ఆడాలని నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించను. అన్ని సినిమాలు బాగా ఆడాలి. కానీ, మన సినిమా బాగుండాలని పక్క చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు అని అన్నారు. నా వెంట్రుక కూడా పీకలేరు” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ట్రోలింగ్ చేసేవారిని ఉద్దేశించి, “నన్ను ట్రోల్ చేస్తున్నందుకు కనీసం డబ్బులైనా ఎక్కువ తీసుకోండి” అని చురకలు అంటించారు. సినిమా విడుదలైన తర్వాత కూడా నెగిటివిటీ పెంచినా తనకు ఇబ్బంది లేదని, తాను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటానని స్పష్టం చేశారు.
సినిమా ట్రైలర్‌పై వచ్చిన “ఎక్కడ నవ్వాలో చెప్పండి రా” అనే కామెంట్ గురించి మాట్లాడుతూ, “థియేటర్‌లో సినిమాని చూడండి, ప్రతి సన్నివేశానికీ కడుపుబ్బా నవ్వుకుంటారు. మీకు నవ్వు రాకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి. సినిమా చూశాక అభిప్రాయం చెప్పండి, దాన్ని నేను గౌరవిస్తా” అని బన్నీ వాస్ అన్నారు.
కథలో బలం ఉంటే, ప్రేక్షకులు దాన్ని తప్పకుండా ఆదరిస్తారని, ఎవరూ ఆపలేరని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, రాగ్ మయూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ వినోదాత్మక చిత్రాన్ని విజయేందర్ తెరకెక్కించారు. ఈ సినిమా దీపావళి పండుగకు అక్టోబర్ 16న విడుదల కానుంది.