Pregnancy Care: గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అంతేకాకుండా గర్భధారణ సమయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. కానీ మనం తెలిసి లేదా తెలియక చేసే కొన్ని పెద్ద తప్పులు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. గర్భధారణ సమయంలో కూడా ఇతర రోజుల మాదిరిగా ఉండటం సాధ్యం కాదు. ఈ రోజుల్లో శరీరం ప్రతిదానికీ స్పందించదు. కాబట్టి మీరు ఏ రకమైన పని చేయాల్సి వచ్చినా ఆలోచించి చేయాలి. ఈ సమయంలో మహిళలు అందం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కాబట్టి వారు బ్యూటీ పార్లర్‌లను సందర్శిస్తారు. కానీ గర్భధారణ సమయంలో బ్యూటీ పార్లర్‌లకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..
బ్యూటీ పార్లర్లలో ఏమి చేయకూడదు;
జుట్టు రంగు:
సాధారణంగా ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతోంది. కాబట్టి తమ జుట్టును దాచుకోవడానికి రంగు వేసుకుంటారు. కానీ గర్భధారణ సమయంలో ఇది మంచిది కాదు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు హార్మోన్ల మార్పులు రావడం సహజం. అలాంటి సమయాల్లో చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రసాయనాలు కలిగిన రంగులు శరీరానికి మంచిది కాకపోవచ్చు.
వ్యాక్సింగ్:
గర్భధారణ సమయంలో వ్యాక్సింగ్ మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. ఈ సమయంలో కొన్ని చర్మ సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాక్సింగ్ కు దూరంగా ఉండటం మంచిది.
Also Read: Almonds: బాదంపప్పుతో వీటిని కలిపి తింటే కొత్త సమస్యలు ఖాయం
బ్లీచ్:
గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు పదే పదే బ్లీచింగ్ చేసుకోవడం ఎవరికీ మంచిది కాదు. బ్లీచింగ్ చేసిన కొన్ని రోజుల తర్వాత మీ చర్మం ముడతలు పడటం ప్రారంభమవుతుంది. అంతే కాదు ఇలా పదే పదే చేయడం వల్ల చర్మ అలెర్జీలు, దురదలు వస్తాయి. కాబట్టి ఇలా చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Pregnancy Care: అంతే కాకుండా గర్భిణీ స్త్రీలకు ప్రైవేట్ పార్ట్స్‌లో ఉండే వెంటుకలను క్లీన్ చేయడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటికి బదులుగా మీరు తల, పాదాల మసాజ్ చేసుకోవచ్చు. ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది. శరీరం కూడా తేలికగా మారుతుంది. కాబట్టి మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సి వస్తే, మసాజ్ చేయించుకోవడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.