Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాకి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ కి వెళ్లి, బాలీవుడ్ కి ఎప్పుడో దూరమైన ఈ భామ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB 29’లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయితే, ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో హీరోయిన్ల పరిస్థితి, సవాళ్ల గురించి ఆమె షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ వివరాలేంటో చూద్దాం!
Also Read: Anirudh: మెగాస్టార్ సినిమాకు అనిరుద్ మ్యాజిక్?
ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో మేల్ డామినేషన్, అసమానతలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హీరోలతో సమానంగా కష్టపడినా పారితోషికంలో భారీ తేడా ఉందన్నారు. కెరీర్ ఆరంభంలో చర్మం రంగు వల్ల విమర్శలు, అవకాశాల నష్టం ఎదుర్కొన్నట్లు చెప్పారు. హాలీవుడ్‌లో సమానత్వం ఉందని, బాలీవుడ్‌లో మార్పు రావాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.