Prajwal Revanna : ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవిత ఖైదు: బెంగళూరు కోర్టు తీర్పు

Prajwal Revanna: కర్నాటక మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు అత్యాచారం కేసులో బెంగళూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. నిన్ననే ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు, ఇవాళ శిక్షను ఖరారు చేసింది. బాధిత మహిళకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా కూడా ఆదేశించింది.

గత ఏడాది, ఒక మహిళ ప్రజ్వల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. ఈ కేసును విచారించిన కోర్టు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని కఠినంగా స్పందించింది.

ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ప్రజ్వల్‌ రేవణ్ణ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు. ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి నేరానికి పాల్పడ్డందుకు దేశవ్యాప్తంగా నిందలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *