Prabhas Marriage: కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అనే చిక్కుప్రశ్నకి సమాధానం దొరికేసింది కానీ ప్రభాస్ పెళ్లెప్పుడు అనేది మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ల క్వశ్చనే.. కట్ చేస్తే.. భగవంతుని సన్నిధిలో ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు కృష్ణంరాజు గారి సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి..
Also Read: Big Boss 9: జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’
ద్రాక్షారామంలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు శ్యామలా దేవి. ప్రభాస్ పెళ్లి గురించి అడగ్గా.. పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు.. మా ఇంట్లో కూడా పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు.. అన్నీ చూసుకోవాలని చెప్పారు. అలాగే ప్రభాస్ పెళ్లి బంధువులమ్మాయితోనా, లేక సినిమా హీరోయిన్ తోనా అనడగ్గా.. తెలియదని.. కానీ పెళ్లి మాత్రం కచ్చితంగా జరుగుతుందని అన్నారు శ్యామలా దేవి..