Prabhas: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ప్రభాస్‌తో సినిమా చెయ్యాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా చివరి దశ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్నాడు. ఇదే ఏడాదిలో రాజాసాబ్, ఫౌజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇదే ఏడాదిలో సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా సినిమా అంటే కచ్చితంగా రాబోయే రెండు మూడు ఏళ్లలో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అనడంలో సందేహం లేదు.
