Spirit: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ వచ్చాయి. ది రాజా సాబ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఫౌజీ టైటిల్, ఫస్ట్ లుక్ కూడా వచ్చాయి. ఇక సందీప్ రెడ్డి ఒక మెట్టు ఎక్కి నేనేమి తక్కువ కాదు. మీకంటే డిఫరెంట్ అంటూ ఏకంగా స్పిరిట్ నుంచి ఆడియో వీడియోనే ఇచ్చాడు. ఈ ఆడియో వీడియో ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది.
Also Read: Fauji: ప్రభాస్ ఫౌజీ ఫస్ట్ లుక్ సంచలనం!
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడిగా సాగాయి. ది రాజా సాబ్ నుంచి కలర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఫౌజీ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చాయి. ఫ్యాన్స్ ఆనందపడ్డారు కానీ పూర్తి ట్రీట్ అనిపించలేదు. అయితే సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ ఇచ్చాడు. స్పిరిట్ నుంచి ఆడియో వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో ప్రభాస్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలివేట్ అయ్యాడు. జైలు సీన్లో ప్రకాష్ రాజ్ సూపరింటెండెంట్‌గా ట్రీట్ చేస్తాడు. చివర్లో ప్రభాస్ డైలాగ్ “నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది” అదిరిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు సందీప్. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి, వివేక్ ఓబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. స్పిరిట్ భారీ హిట్ అవుతుందని అంచనాలు మొదలయ్యాయి.

