Puja Hegde: హాట్ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు రెడ్ కార్పెట్ వేసి మరీ అవకాశాలు ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. అయితే, గతకొంత కాలంగా టాలీవుడ్‌లో సరైన హిట్స్ లేకపోవడంతో, ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్‌పైనే పెట్టింది.
అయితే, తాజాగా ఆమె నటించిన ‘దేవా’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పూజా హెగ్డే చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.‘అల వైకుంఠపురములో’ తమిళ సినిమా అయినా కూడా హిందీ ఆడియెన్స్ దానిని పాన్ ఇండియా మూవీగా బాగా ఆదరించారని.. పెర్ఫార్మన్స్ బాగుంటే, అది ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఇది కూడా చదవండి: Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా పోస్ట్ తో మెగా అభిమానుల్లో పూనకాలు లోడింగ్!
ఈ కామెంట్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. అలా వైకుంఠపురంలో తమిళ సినిమా కాదు తెలుగు సినిమా అంటూ పూజాని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాను నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తమిళ్ మూవీ అని చెప్పడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఓ రేంజిలో మండిపడుతున్నారు. మరి ఈ వివాదంపై పూజా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ButtaBomma Video Song: