Sandeep Reddy Vanga: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుర్ర స్టార్ హీరోలకు పోటీగా సాలిడ్ లైనప్ తో దూసుకుపోతున్నాడు చిరు. మెగాస్టార్ చిరంజీవికి కల్ట్ ఫ్యాన్స్ మామూలుగా లేరు. పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా చిరు కల్ట్ ఫ్యాన్స్ లో ఒకరు. మెగాస్టార్ తో సినిమా చేయకపోయినా ఆయన పట్ల ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తం చేసాడు. ఇంకా వ్యక్తం చేస్తున్నాడు కూడా. తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక్క పోస్ట్ ని వదిలాడు. ఆ పోస్ట్ మెగా ఫ్యాన్స్ కి పూనకలు తెప్పిస్తుంది. తమ భద్రకాళి సినిమా ఆఫీస్ నుంచి షేర్ చేసుకున్న ఈ పిక్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ ఫ్రేమ్ ఉంది. దీంతో సోషల్ మీడియా తగలబడిపోతుంది. మెగాస్టార్ “ఆరాధన” సినిమా నుంచి ఒక సీన్ లో ఫ్రేమ్ను కట్ చేసి పెట్టుకోవడం చూస్తుంటే ఈ యానిమల్ డైరెక్టర్ కి చిరు అంటే ఎంత పిచ్చో పూర్తిగా అర్ధం అవుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ కాంబోలో ఒక్క కల్ట్ మూవీ పడితే థియేటర్లలో పూనకాలు లోడ్ అవ్వడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
