Ponnam Prabhakar: మేనెల 6న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెకు దిగుతాం. మే 7వ తేదీ ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు వెళ్లదు… అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ నోటీసును సైతం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం నుంచి చర్చలకు ఆస్కారం ఉంటుందని భావించిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి నిన్నటి వరకు నిరాశే ఎదురైంది. ఇక మిగిలింది రెండు రోజులే గడువు ఉన్న సమయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం.. అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మే 4న ఆదివారం ప్రకటించారు. తమ ప్రభుత్వ పరిస్థితి ఏమీ బాగోలేదని, కార్మిక సంఘాలు అర్థం చేసుకోవాలని హిత వచనాలు పలికారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ కార్మికులు సహకరించాలని మంత్రి కోరారు.
Ponnam Prabhakar: ఇప్పుడిప్పుడే ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మే నెల 5, 6 తేదీల్లో ఎప్పుడైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలకు వస్తే తాము సిద్ధమేనంటూ ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల్లో మదనం మొదలైంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తూనే చర్చలకు పిలువడంపైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చిస్తున్నాయి.
Ponnam Prabhakar: ఈ దశలో ఆర్థికపరమైన డిమాండ్లు తీర్చకుండా సమ్మెను విరమించమని కోరుతారా? అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చలకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని కొందరు వాదిస్తుండగా, వెళ్లి వారి వైఫల్యంతోనే సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించవచ్చని మరికొందరు నేతలు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.

