Ponnam Prabhakar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ప్రారంభానికి ముందు మరో మంత్రి అయిన వివేక్‌తో మాట్లాడుతూ అడ్లూరికి ఆలస్యం కావడంపై నిష్టూరమాడుతూ దుర్భాషలాడారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.
Ponnam Prabhakar: దళిత నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు సహా పలువురు మంత్రి పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అదే విధంగా తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏకంగా పొన్నం ప్రభాకర్‌కు అల్టిమేటమే జారీ చేవారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే అధిష్టానం వద్దే తాను తేల్చుకుంటానని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
Ponnam Prabhakar: ఈ మేరకు దిగొచ్చిన పొన్నం ప్రభాకర్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అన్న వ్యాఖ్యల్లో ఎక్కడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరును ప్రస్తావించలేదని చెప్పారు. తామిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, మరో విషయమేమీ లేదని చెప్పుకొచ్చారు. ఆ విషయం గురించి ఫోన్లో అడ్లూరితో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
Ponnam Prabhakar: ఇదే విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కూడా తాను మాట్లాడినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీన్నిబట్టి ఈ విషయం ఇప్పట్లో సమసిపోయేలా లేదని తెలుస్తున్నది. పొన్నం మాట్లాడిన విషయాల్లో తన మాటల్లో అడ్లూరి పేరు లేదన్నారు కానీ, ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలను చేశాడనే విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం.