మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన మీడియాతో సంబేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
హైడ్రా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు. గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు నిర్వాసితులను లాఠీలతో అణిచివేశారని గుర్తుచేశారు.హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తునట్టు తెలిపారు. పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది.. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్ది అని అన్నారు.
మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు అని చురకలు అంటించారు. బీఆర్ఎస్ పాలనలో నిత్యం అరెస్టులు జరిగేవని గుర్తుచేశారు.

