Health Tips: సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు రాకముందే శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. మన శరీరం మనకు ఇచ్చే హెచ్చరికలను సరిగ్గా అర్థం చేసుకుని, సమస్య చేయి దాటకముందే అలర్ట్ అవ్వాలి. సమస్యలు తలెత్తే ముందు శరీరం ఎలాంటి హెచ్చరికలు ఇస్తుంది? దాని అర్థం ఏమిటి? ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా నోరు లేదా పెదవులు పగిలితే మీకు విటమిన్ బి లోపం ఉందని అర్థం. ఇది జరిగితే ఎక్కువ నీరు త్రాగాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పెదాలను క్రమం తప్పకుండా తేమగా ఉంచుకోవాలి.
తీవ్రమైన వెన్నునొప్పి ఉంటే విటమిన్ డి లోపం ఉండవచ్చు. కాబట్టి వీలైనంత నిటారుగా కూర్చోండి. ఉదయం సూర్యకిరణాలు శరీరంపై పడేలా చూసుకోవాలి. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
ఇది కూడా చదవండి: Salt for Hair Care: జుట్టు సమస్యలకు ఉప్పుతో చెక్.. ఎలా అంటే..?
Health Tips: ముఖం మీద మొటిమలు ఉంటే విటమిన్ ఇ, జింక్ లోపం ఉందని అర్థం. కాబట్టి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. ప్యాక్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్, చాక్లెట్, ఐస్ క్రీం వంటి ఆహార పదార్థాలను తక్కువగా తినాలి. రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
రంతరం అలసిపోయి, నిద్రపోతున్నట్లు అనిపిస్తే శరీరంలో విటమిన్లు బి2, సి, ఐరన్ లోపం ఉండవచ్చు. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు సాధారణంగా అలసట వస్తుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు త్రాగటం మర్చిపోవద్దు. ఒత్తిడి నిద్రకు భంగం, అలసటను పెంచుతుంది. కాబట్టి ధ్యానం, యోగా లేదా ఇతర పనులతో ఒత్తిడిని తగ్గించుకోవాలి.
కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తే శరీరంలో విటమిన్లు E, K లోపించి ఉన్నాయని అర్థం. కాబట్టి కళ్ళకు క్రమం తప్పకుండా విరామం ఇవ్వాలి. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం మానుకోవాలి. అలాగే రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.
జుట్టు రాలడం, తెల్ల జుట్టు నిస్తేజంగా మారడం వంటివి అనిపిస్తే బయోటిన్, విటమిన్ బి12 లోపం ఉందని అర్థం. కాబట్టి ప్రతిరోజూ జుట్టును సరిగ్గా దువ్వుకోవాలి. అలాగే వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి.