PM Modi:ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ఏపీలో పర్యటించనున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్రంలో టీడీపీ, జనసేన పొత్తు కీలకంగా మారింది. దాంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నది. ఈ దిశలో మరో కీలక అంకానికి శ్రీకారం చుట్టేందుకు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిసింది.
PM Modi:ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద పరిధిలో క్షిపణి పరీక్ష కేంద్రం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం డీఆర్‌డీఓ సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయనున్నది. ఇక్కడి క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011 సంవత్సరంలోనే గుర్తించారు. ఈ మేరకు 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని ప్రధాని చెప్పినట్టు తెలిసింది.
PM Modi:గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయిందని, దానిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రాబాబు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ సాయాన్ని కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఊహించన దానికంటే ఎక్కువగానే ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నట్టు తెలుస్తున్నది.
PM Modi:ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇదే ప్రాజెక్టు గురించి చర్చించినట్టు ఇటీవలే ఆయన ప్రకటించారు. గత అక్టోబర్‌లోనే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా కమిటీ ఏపీలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లమోద క్షిపణి పరీక్ష కేంద్రం రూపుదిద్దుకోనున్నది.