Trump-Modi: మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతల ప్రజాదరణ, ఆమోదంపై ఈ సర్వేను నిర్వహిస్తారు.
తాజా సర్వే ఫలితాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ -75% ఆమోద రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ వంటి ఇతర ప్రపంచ నాయకులను మోదీ అధిగమించారు.
ఇది కూడా చదవండి: Ashok Gajapathi Raju: నేడు గోవా కి నారా లోకేష్.. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
ఈ ఏడాది జులై 4-10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. అందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా 75శాతం మద్దతుతో మోదీ మొదటిస్థానంలో నిలిచారు. 57శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ రెండో స్థానంలో ఉన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి, కెనడా ప్రధాని మార్క్కార్నీ తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44శాతంతో ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ఈ అధిక ఆమోద రేటింగ్ దేశంలో, అంతర్జాతీయంగా ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ఆయన విధానాలపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఆయన పాలనా విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు, సంక్షేమ కార్యక్రమాలకు లభిస్తున్న మద్దతుకు నిదర్శనంగా భావిస్తున్నారు.
ప్రధాని మోదీకి ఈ స్థానం దక్కడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా మార్నింగ్ కన్సల్ట్ సహా పలు అంతర్జాతీయ సర్వేల్లో ఆయన అత్యధిక ఆమోద రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచారు.