PM Narendra Modi:

PM Narendra Modi: మాల్డీవుల‌లో మోదీకి అరుదైన గౌర‌వం

PM Narendra Modi: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మాల్దీవులు దేశంలో అరుదైన గౌర‌వం ద‌క్కింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఆయ‌న‌తోపాటు విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, విదేశీ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీ వెళ్లారు. ఈ మేర‌కు శ‌నివారం (జూలై 26) మాల్దీవులు 60వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

PM Narendra Modi: మాల్దీవులు 60వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లను పుర‌స్క‌రించుకొని త‌మ దేశానికి వ‌చ్చిన భార‌త ప్ర‌ధాని మోదీకి త‌మ ర‌క్ష‌ణ శాఖ కార్యాల‌యంపై భారీ ఫొటోను ఉంచి ఆ దేశం గౌర‌వించింది. స్వాతంత్య్ర వేడుక‌ల్లో మోదీ ఫొటో ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. భార‌త్‌, మాల్దీవులు వివాదాల అనంత‌రం ఇలా ఓ దేశ ప్ర‌ధానిని ఇలా గౌర‌వించ‌డం చాలా అరుదైన విష‌యంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

PM Narendra Modi: మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ దేశంతో ప‌లు కీల‌క ఒప్పందాలు చేసుకున్నారు. ఆ దేశానికి అంద‌జేసే లైన్ ఆఫ్ క్రెడిట్ (లోన్)గా రూ.4,850 కోట్ల‌కు పెంచారు. ఇండియా-మాల్డీవుల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై చర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని వెల్ల‌డించారు. అద్దు న‌గ‌రంలో రోడ్లు, డ్రైనేజీ ప్రాజెక్టుల‌ను మోదీ ప్రారంభించారు. ఆ దేశానికి 72 వాహ‌నాల‌ను సైతం అంద‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *