PM Kisan yojana: పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో 21వ విడుత నగదు సాయం ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్తే వచ్చిందని చెప్పవచ్చు. దీపావళి పర్వదినం సందర్భంగా వస్తుందని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. అయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ రైతులకు పీఎం కిసాన్ సొమ్ము 21వ విడత నగదును కేంద్ర ప్రభుత్వం జమచేసింది. అక్కడ ఏర్పడిన ప్రకృతి వైపరీత్యం కారణంగా విడుదల చేసింది.
PM Kisan yojana: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో రూ.6,000 నగదును పీఎం కిసాన్ యోజన కింద జమ చేస్తుంది. ఈ సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో కేంద్రం జమచేస్తుంది. ఈ సొమ్ము కూడా మూడు విడతలుగా రూ.2,000 చొప్పున విడుదల అవుతాయి. రైతులు తమ పంటలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను ఏటా అందజేస్తున్నది.
PM Kisan yojana: పీఎం కిసాన్ యోజన నగదు మూడో విడత సాయం విడుదలపై కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు నవంబర్ తొలి వారంలోనే వేయనున్నట్టు తెలుస్తున్నది. అంటే రెండు మూడు రోజుల్లోనే ఆ నగదు రైతుల ఖాతాల్లో జమకానున్నది. లేదంటే రెండో వారంలోనైనా జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
PM Kisan yojana: ముఖ్యంగా బీహార్ ఎన్నికల ముంగిట పీఎం కిసాన్ నగదు సాయాన్ని అందజేయనున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే గతంలో కూడా పలు ఎన్నికల సమయంలోనే రైతుల ఖాతాల్లో జమచేసింది. రైతుల ఖాతాల్లో నగదు సాయాన్ని జమ చేయడాన్ని ఎన్నికల సంఘం కూడా ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకపోవడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నది.
PM Kisan yojana: తాజాగా బీహార్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీయే సర్కార్.. ఆ ఎన్నికలకు మరో 5 రోజుల ప్రచార గడువు ఉన్నది. అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే నగదు సాయం విడుదలకు బలమైన అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త రైతులు కూడా భూమి పాస్ పుస్తకానికి ఆధార్, ఫోన్, బ్యాంకు అకౌంట్ నంబర్లు అనుసంధానం చేయించుకున్నారో లేదో సరిచూసుకోవాలి.

