Delhi: ‘డిజిటల్ అరెస్ట్’ అంటే.. ఈ నెంబర్ కి ఫోన్ చేయండి

Delhi: దేశంలో కొత్తరకం సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ‘డిజిటల్ అరెస్ట్’ అనే పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) హెచ్చరించింది. తాము పోలీస్, సీబీఐ, కస్టమ్స్ లేదా ఐటీ శాఖ అధికారులమని చెప్పి బాధితులను బెదిరిస్తూ డబ్బులు దోచుకునే సంఘటనలు పెరిగిపోతున్నాయని NPCI పేర్కొంది.

ఎలా మోసం చేస్తారు?

మొదట బాధితులకు సాధారణ ఫోన్ కాల్ చేస్తారు తర్వాత వీడియో కాల్‌కి మారి, నకిలీ పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ ఆఫీస్ సెటప్ చూపిస్తారు యూనిఫాం, లోగోలు, నేపథ్య శబ్దాలతో నమ్మిస్తారు. మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసు, పన్ను ఎగవేత ఆరోపణలు చేసి భయపెడతారు. “అరెస్ట్ చేస్తాం”, “కేసు తీయాలంటే డబ్బు జమ చేయాలి” అని బెదిరిస్తారు “సెక్యూరిటీ డిపాజిట్”, “కోర్టు క్లియరెన్స్” అంటూ డబ్బులు బదిలీ చేయిస్తారు

NPCI సూచనలు

✅ ప్రభుత్వ అధికారులు ఫోన్/వీడియో కాల్ ద్వారా విచారణ చేయరు

✅ ఎప్పుడూ డబ్బులు అడగరు

✅ అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే కట్ చేయాలి

✅ వివరాలు తప్పనిసరిగా ధృవీకరించాలి

✅ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి

సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: 1930

సంచార్ సాథి పోర్టల్: అనుమానాస్పద నంబర్లను రిపోర్ట్ చేయాలి

NPCI ప్రజలకు సూచించింది: మోసగాళ్లతో జరిపిన సందేశాలు, స్క్రీన్‌షాట్లు సేవ్ చేసుకోవాలి — ఇవి ఫిర్యాదులో సాక్ష్యాలు అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *