PM Kisan Mandan Yojana: రైతులకు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఇప్పటికే వివిధ రైతు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్రం వివిధ పథకాలను అందజేస్తూ వస్తున్నది. తాజాగా తీసుకొస్తామన్న పథకం రైతులకు ఊరట కలిగించేదిగా భావిస్తున్నారు.
PM Kisan Mandan Yojana: ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రైతులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే నెలకు రూ.3,000 చొప్పున ఏటా రూ.36,000 పెన్షన్ పొందవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో ఈ పథకాన్ని అనుసంధానించానించింది.
PM Kisan Mandan Yojana: పీఎం కిసాన్ యోజనతో ఏటా రూ.6,000ను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజనను తెస్తుండటం రైతులకు మరింత ఆసరా ఉండనున్నది. వృద్ధాప్యంలో రైతులకు ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది.