Pulivendula Sathi Reddy: రాజకీయాల్లో తలపండిన ఆ నేతకు ఎన్నికల నిబంధనలు తెలియవా? లోకేష్, చంద్రబాబులపై విమర్శలు చేయమని జగన్ ఆదేశించారా? గత ప్రభుత్వంలో బూతులు తిట్టిన వారికే మంత్రి పదవులిచ్చాడు జగన్మోహన్రెడ్డి. అది చూసి ఈ నేత రెచ్చిపోతున్నాడా? సినిమా డైలాగులతో మేక పోతు గాంభీర్యం దేనికి? చట్టాన్ని కాపాడుతున్న పోలీసులపై నోరు పారేసుకోవడం అవసరమా..? అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు తయారయ్యింది పులివెందుల సత్తి రెడ్డి పరిస్థితి.
కడపలో సతీష్ రెడ్డి ఎవరి మెప్పుకోసం ప్రాకులాడుతున్నారు.? జగన్ మాయలో ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడం లేదా? వైసీపీలో రెండో స్థానం కోసం పోటీపడుతున్న సతీష్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ లోకేష్, చంద్రబాబులను విమర్శిస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉండి బయటపడిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్ కోసం
మాట్లాడుతుండటం చూసి వైసీపీ వర్గీయులకే రోత పుట్టించేలా ఉంటోందట. నిజానికి పులివెందులలో ఇంత కాలం జరిగింది రాజకీయం కాదు. వర్గ పోరాటం. అలాంటి వర్గ పోరాటంలో సతీష్ రెడ్డి వచ్చి పార్టీలో చేరిపోతే కలుపుకునేందుకు వైఎస్ కుటుంబ వర్గాలు సిద్ధంగా ఉండవు. అదే సమయంలో జగన్‌ను మెప్పించాలంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలన్న ఫార్ములాను సతీష్ రెడ్డి పాటిస్తున్నారు. ఇది కూడా ఎబ్బెట్టుగా మారింది. ఆయన పులివెందుల వైసీపీకి ప్లస్ కాదని.. టోటల్ మైనస్ అని ఆ పార్టీ క్యాడరే గొణుక్కుంటున్నారు.
Also Read: Jagan Security Game: ‘అతడు’ సీన్ ఏపీ రాజకీయాల్లో రిపీట్ కాబోతోందా?
వైయస్సార్ హయాంలో జైలుకు సైతం వెళ్ళిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో విమర్శలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన చంద్రబాబుని గతంలో దేవుడని కొనియాడిన సతీష్ రెడ్డి… ఇప్పుడు మాత్రం చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. జగన్ జపం చేస్తూ లేని పోని వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు సతీష్ రెడ్డి. అర్థం పర్థం లేని వాగుడుతో తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకోవడంతో పాటూ, వైసీపీ క్యాడర్‌కి చిర్రెత్తిస్తున్నారట సతీష్ రెడ్డి.
చంద్రబాబు, లోకేష్‌లే టార్గెట్‌గా మాట్లాడుతున్న సతీష్ రెడ్డి.. వైసీపీ రాజకీయ భవిష్యత్ కోసం పడుతున్న తపన చూస్తే పాపం అనిపిస్తోంది. మునిగిపోయే నావలో ప్రయాణిస్తున్న సతీష్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరుస్తారో లేదో కానీ… ఆయన నిజంగా ఏ పార్టీలో లబ్ది పొందాడో కడప ప్రజలందరికి తెలుసంటున్నారు పరిశీలకులు.
