AP News: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధుల కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 2, 2025న ఈ నిధులు విడుదల చేయనున్నారు . వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.831.60 కోట్లు అందుతాయి. అదే రోజున ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు పీఎం కిసాన్ 20వ విడత (రూ. 2,000) కూడా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 20వ విడత నిధులు పొందడానికి రైతులు eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేయడం తప్పనిసరి. అలాగే, ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో అనుసంధానం (NPCI మ్యాపింగ్) అయి ఉండాలి . ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి నిధులు అందకపోవచ్చు.
Also Read: USA: న్యూయార్క్లో కాల్పుల .. ఐదుగురి మృతి
సాధారణంగా, పీఎం కిసాన్ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి (ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి) విడుదల అవుతాయి. 19వ విడత 2025 ఫిబ్రవరిలో విడుదలైంది. కాగా ఏపీలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులకు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మందికి కేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద, అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో (ప్రతి ₹2,000) నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.